Modi calls Elon : ఎలాన్‌ మస్క్‌ కు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్

TRINETHRAM NEWS

Trinethram News : టారీఫ్ ల విషయంలో భారత్‌, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వంలోని డోజ్‌ విభాగ అధిపతి, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌ లో చర్చలు జరిపారు. సాంకేతికత, నూతన ఆవిష్కరణల్లో భాగస్వామ్యం గురించి వారు చర్చించారు. ఇదే విషయాన్ని మోదీ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌తో పలు అంశాలపై మాట్లాడా. ఈ ఏడాది ఆరంభంలో వాషింగ్టన్‌లో భేటీ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలనూ మేం ప్రస్తావించాం. సాంకేతికత, ఆవిష్కరణ రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్‌ కృతనిశ్చయంతో ఉంది’’ అని మోదీ రాసుకొచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

PM Modi calls Elon Musk

You cannot copy content of this page

Scroll to Top