TRINETHRAM NEWS

అంజలి తలిదండ్రులకు అండగా ఉంటాం

వ్యక్తిగతంగా మా ట్రస్టు నుంచి రూ.2 లక్షలు అందిస్తాం

రాజమహేంద్రవరం: ఫార్మశీ విద్యార్థిని అంజలి మృతి బాధాకరమని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ వద్ద అంజలి తల్లిదండ్రులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పరామర్శించి అన్ని విధాలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ అంజలి సంఘటన తర్వాత తాను ఆసుపత్రికి వెళ్ళి వైద్యులను ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నానని, ఆమె కోలుకోవాలని దేవుడ్ని ప్రార్థించేవాడినని చెప్పారు. తలిదండ్రులకు ఆమె లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, వారికి తాను పూర్తిగా అండగా ఉంటానని ఇచ్చారు.

వారికి ఆర్థిక భరోసా కల్పించేందుకు వ్యక్తిగతం తమ ట్రస్టు ద్వారా రూ.2 లక్షలు సాయం ప్రకటించారు. ప్రభుత్వం నుంచి రావాలసిన సాయం వస్తుందని స్పష్టం చేశారు. ఇప్పటికే తాను హోం మంత్రి అనిత దృష్టికి తీసుకు వెళ్లానని, ఆమె విచారం వ్యక్తం చేసి వెంటనే మంత్రి నారా లోకేష్ తో మాట్లాడారని వారు ఈ అంశాన్ని సీఎం చంద్రబాబుకు చెప్పి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు చర్యలు చేపడుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు.

ఈ కేసు విషయంలో పోలీసులు చాలా పారదర్శకంగా పని చేస్తున్నారని, అంజలి మృతికి కారణమైన వ్యక్తిని ఇంటారాగేషన్ చేయడానికి కస్టడీకి అడుగు తున్నారని చెప్పారు. ఆసుపత్రిలో సీసీ పుటేజీని ఐవీఆర్ ద్వారా తీసుకుని పోలీసులు పరిశీలిస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని క్షుణ్ణంగా చూస్తోందని ఆయన చెప్పారు. అంజలి మృతికి కారణమైన వ్యక్తికి శిక్ష పడేలా చేస్తామని ఆయన స్పష్టం చేశారు. అంంజలి రూమ్మేట్స్ ను కూడా ఒక్కొక్కరిని పిలిచి వివరాలు సేకరిస్తున్నారని ఆయన తెలిపారు. అంజలి సామాజిక వర్గానికి చెందిన జనసేన రాజమండ్రి సిటీ ఇన్చార్జి అనుశ్రీ సత్యనారాయణ, పెరికి కుల కార్పొరేషన్ చైర్మన్ కూడా దగ్గరే ఉండి ఆ కుటుంబానికి న్యాయం జరిగేందుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pharmacy student Anjali's death