TRINETHRAM NEWS

People who are suffering under the rule of special authorities

MRPS ( TS )జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ..

భూపాలపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మార్పీఎస్ టీఎస్ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ హాజరై మాట్లాడుతూ సర్పంచుల కాలం అయిపోయి ఆరు ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికలు నిర్వహించడం లేదని, అందువల్ల గ్రామాల్లో ఎక్కడి సమస్యలు అక్కడే పేరుకు పోతున్నాయని జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ అన్నారు.గ్రామాలకు రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఆఫీసర్లు నియమించి గ్రామ సెక్రెటరీ మరియు స్పెషల్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో గ్రామ సమస్యలను పరిశీలించాలని స్పెషల్ ఆఫీసర్లను నియమించిందని,కానీ గ్రామాలలో సమస్యలు మాత్రం ఎక్కడ చేసినా గొంగళి అక్కడే అన్నట్టుగా ఉన్నాయి. గ్రామాల్లో కుళాయి లు సరిగా లేక వీధిలైట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ఏ గ్రామానికి వెళ్లిన ఊరు నిండా సమస్యలు ఉన్నాయని,ఏ అధికారి కూడా వాటిని పట్టించుకోవడంలేదని జనాలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి గ్రామపంచాయతీ సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు..

ఈ కార్యక్రమంలో MRPS (TS) టేకుమట్ల మండల అధ్యక్షులు రేణిగుంట్ల రాము మాదిగ , చిట్యాల మండల నాయకులు కనకం తిరుపతి మాదిగ,పుల్యాల.సురేష్ మాదిగ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

People who are suffering under the rule of special authorities