TRINETHRAM NEWS

People should be alert in the face of heavy rains

Trinethram News : ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు అందుబాటులో ఉంటూ అవసరమైన సహాయ చర్యలు చేపట్టండి.

చేవెళ్ల నియోజకవర్గం ఎమ్మెల్యే కాలే యాదయ్య.

చేవెళ్ల నియోజకవర్గం వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య సూచించారు. వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నందున ఎవ్వరు దగ్గరకు వెళ్ళకూడదని తెలిపారు. అదేవిధంగా చెరువులు పూర్తిగా నిండి అలుగులు పోస్తున్నందున ఎవ్వరు కూడా చెరువుల దగ్గరకు వెళ్ళకూడదు. కల్వర్టులు, బ్రిడ్జిల దగ్గరకు వెళ్ళవద్దు, దాటడానికి ప్రయత్నం చేయవద్దు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయకండి.

పాత ఇల్లలో నివసిస్తున్న వారు తక్షణమే ఇంటిని విడిచి సమీపంలోని ప్రభుత్వ భవనాలు, పాఠశాలలో ఆశ్రయం పొందాలి. పాత గోడల దగ్గరకు వెళ్ళవద్దు. కరంటు స్తంభాలు, వైర్లను ముట్టుకోవద్దు. ముఖ్యంగా చిన్న పిల్లలను ఇంట్లోనే ఉంచండి, బయటకు రానివ్వద్దు. రైతులు తమ పంట పొలాలలో, చేలలో నిల్వ ఉన్న వర్షపు నీటిని వెంటనే తొలగించుకోండి. ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అందుబాటులో ఉండండి.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App