Pending SC Corporation loans should be sanctioned
ప్రైవేటు రంగాల్లో దళితులకు రిజర్వేషన్ అమలు చేసి,
ఎస్సి ఇండస్ట్రీస్ సబ్సిడీ నిధులు విడుదల చేసి అంబేద్కర్ అభయ హస్తం 12లక్షలు పథకాన్ని ప్రారంభించాలి.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
దళిత హక్కుల పోరాట సమితి పెద్దపల్లి జిల్లా సమితి సమావేశం బొద్దుల రమేష్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి ముఖ్య అతిథులుగా దళిత కుల పోరాట సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుపాక అనిల్ కుమార్ హాజరై మాట్లాడుతూ
దేశవ్యాప్తంగా SC సబ్ ప్లాన్ చట్టం అమలతో పాటు మరియు రాష్ట్ర అసెంబ్లీలో జనాభా ఆధారంగా బడ్జెట్ ను కేటాయింపు చేయాలని, ప్రైవేటు రంగాల్లో దళితులకు రిజర్వేషన్ అమలు చేసి, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణను నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు.అదే విధంగా ఎస్సీ ఇండస్ట్రీ సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, పెండింగ్లో ఉన్న ఎస్సీ కార్పొరేషన్ లబ్ధిదారులకు సబ్సిడీ నిధులను విడుదల చేయాలని, నూతనంగా ఎస్సీ కార్పొరేషన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
దళితులపై దౌర్జన్యాలు మరియు అంటరానితనాన్ని తక్షణమే నిలిపివేయాలని, భారత రాజ్యాంగం ప్రకారం దళితులకు సామాజిక, ఆర్థిక, రాజకీయ హక్కులను కల్పించాలని,
దళితులకు విద్యా హక్కు, భూమి హక్కు మరియు ఉపాధి అవకాశాలు కల్పించాలి.
సాధారణ జనాభాగణతో పాటు సామాజిక,ఆర్థిక కులగణన నిర్వహించాలన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మ్యానిఫెస్టోలో పెట్టిన అంబేద్కర్ అభయ హస్తం ప్రారంభించి దళితుల అభ్యున్నతి కోసం పాటు పడాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం గారు మాట్లాడుతూ రాష్ట్రంలో అనేకమంది దళితుల పైన దాడులు జరుగుతున్నాయని మతోన్మాద శక్తులను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి డీహెచ్పీఎస్ కార్యకర్తపై ఉందని రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లాలో దళిత హక్కుల పోరాట సమితి ని బలోపేతం చేయాలని సమావేశంలోని నాయకులకు కార్యకర్తలకు పిలుపునిచ్చారు ఇంకా ఈ కార్యక్రమంలో
దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు కందుకూరి రాజారత్నం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మద్దెల దినేష్, రాష్ట్ర సమితి సభ్యులు అసాల రమ,
జిల్లా నగర నాయకులు ఏర్రల రాజయ్య, శనిగరపు తిరుమల, ఆరెపల్లి మానస్ కుమార్ చంద్రగిరి ఉదయ్, రమేష్, బండారి సదానందం, గంగారపు ప్రసాద్ మరియు శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు
అనంతరం డిహెచ్పిఎస్ జిల్లా కన్వినింగ్ కమిటీని ఎన్నుకోవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App