ఆసిఫాబాద్ జిల్లా ఆస్పత్రి కాంట్రాక్ట్ శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలి
ఎఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని డిస్టిక్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆసుపత్రుల్లో పనిచేయుచున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ కార్మికులకు గత 4 నెలలుగా జీతాలు అందక అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని పెండింగ్లో ఉన్న వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ అన్నారు. తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అండ్ వర్కర్స్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆసుపత్రి సూపర్డెంట్ ప్రవీణ్ వినతిపత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్ పేషంట్ కేర్ మరియు సెక్యూరిటీ సిబ్బందికి జీవో నెంబర్ 60 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు, డిస్టిక్ మెడికల్ ఎడ్యుకేషన్ పరిధిలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పనిచేయుచున్నటువంటి కార్మికులకు బడ్జెట్ రాలేదు.
అనే నెపంతో కాంట్రాక్టర్లు గత 4 నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఉన్నారని వెంటనే బడ్జెట్ విడుదల చేసి కార్మికులకు జీతాలు అందే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.చాలా కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోను అమలు చేయకుండా కార్మికులకు కొద్దిమంది కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కై కార్మికులకు అన్యాయం చేయుచున్నారని వారు వివరించారు.చట్ట ప్రకారం రావలసిన సెలవులను సైతం అమలు చేయడం లేదని, అడిగిన కార్మికులపై దౌర్జన్యానికి తెగబడుతున్నారని వారు తెలియజేశారు. అలాగే కార్మికులందరికీ ఈఎస్ఐ పీఎఫ్ సౌకర్యం కల్పించి వాటి వివరాలు వెంటనే తెలియజేయాలని డిమాండ్ చేశారు ప్రతినెల బ్యాంకు ధర వేతనాలు ప్రతి నెల 5వ తేదీ లోపు చెల్లించాలని పండుగ సెలవులను ఇవ్వాలని ఇప్పటికైనా పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే చెల్లించాలని లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాలు చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు పిడుగు శంకర్, హాస్పిటల్ ప్రెసిడెంట్ శైలం,సిబ్బంది గుణవంతురావు,మారుతి, నీల కమల తో పాటు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App