TRINETHRAM NEWS

రామగుండం మార్చి-16//త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నాయకులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం
ఈరోజు రామగుండం పట్టణంలోని మజీద్ కార్నర్ లో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ ఆదేశాల మేరకు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసెంబ్లీలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పట్ల ఏక వచనంతో సంబోధిస్తూ అసెంబ్లీ ఏమైనా మీ సొంతమా అని మాట్లాడి సభాపతినీ అ పరుస్తూ మాట్లాడినందుకు నిరసనగా రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈదునూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో జగదీశ్ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఈ సందర్భంగా ఈదునూరి హరిప్రసాద్ మాట్లాడుతూ సభాపతి భంగం కలిగేలా మాట్లాడిన జగదీష్ రెడ్డిని వెంటనే అసెంబ్లీ సభ్యత్వం శాశ్వతంగా రద్దుచేసి ఒక దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్ ను అవమానించినందుకు జగదీష్ రెడ్డి పైన వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి చట్టపరంగా శిక్షిస్తే భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని కచ్చితంగా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఈ దిశగా ఆలోచన చేసి శిక్షించాలని రామగుండం పట్టణ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పాసి శ్రీనివాస్ పటేల్, మహమ్మద్ ఉస్మాన్ షరీఫ్, సిరి శెట్టి సతీష్ గౌడ్, ఎండి అఫ్సర్ (బుత్తుల్), కలవని చందు, ఎండి గౌస్ బాబా, ఈదునూరి వెంకటస్వామి, ఇంజపల్లి ప్రణీత్, పల్లికొండ భూమేష్, ఎండి అబ్బు, గోగుల సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Raj Thakur