జూన్ 26, 2026

WhatsApp Image 2024 06 19 at 14.31.37

TRINETHRAM NEWS

Pedpadalli ACP registered the land of an old man without giving money

పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

టేకుమట్ల – ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు.

ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది.

రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకు వచ్చారు కానీ, ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం పెట్టిన తర్వాత ఇస్తామని అక్కడ ఇయ్యలేదు. ఇంటికి వచ్చి ఇస్తామని చెప్పి బోర్ రిపేర్ చేసిన తర్వాతనే అన్ని డబ్బులు ముట్టచెప్తానని వెళ్లిపోయారు.

మళ్లీ డబ్బులు ఇయ్యమని ఇంటికి పోతే మొదట ఇస్తా అన్నడు తర్వాత ఇవ్వనుపో అన్నడు. పోలీసులు, ఎమ్మెల్యేకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదనతో బంధువులతో కలిసి పురుగుల మందు డబ్బాతో బాధిత వృద్ధుడి ధర్నా
ఆయనకి మద్దతు తెలిపిన టేకుమట్ల మండల రైతులు, ప్రజలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Pedpadalli ACP registered the land of an old man without giving money

You cannot copy content of this page