
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ వికారాబాదీ జిల్లా వ్యాప్తంగా రవాణా శాఖలో ఫిబ్రవరి 2025 సంవత్సరం ఒక్క నెలకిగాను ట్యాక్స్ చెల్లించని 153 వాహనాలను సీజ్ చేసే 46,62,375 రూపాయల జరిమానాను ఓక్క నెలలోనే వసూలు చేయడం జిరిగిందని జిల్లా రవాణా అధికారి వెంకట్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇంకా ట్యాక్స్ చెల్లించని వాహనదారులు ఆన్ లైన్ లో లేదా మీసేవా ద్వారా ట్యాక్స్ చెల్లించాలని ఆయన తెలిపారు.
ట్యాక్స్ చెల్లించనీ వాహనాల్లో ఎక్కువగా మధ్య, చిన్న వాహనాలు వాహనాలు ఉన్నాయని ఆయన తెలిపారు. అలాగే ప్రతి ఒక్క వాహనదారుడు తమ వాహనాన్ని వారి మొబైల్ నెంబర్ కి లింక్ చేసుకోవాలని, తద్వారా వాహనానికి సంభందించిన సమాచారం, ఫిటెనెస్, రెన్యువల్, టాక్సీ పేమెంట్స్ మొదలగు సమాచారం మొబైల్ ఫోన్ ద్వారా పోందవచ్చని అయన తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
