ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 12 23 at 15.10.53

TRINETHRAM NEWS

– పద్మనాయక ఫంక్షన్ హల్స్ అక్రమ నిర్మాణాలను కూల్చివేయండి

-చొప్పదండి : త్రి నేత్రం న్యూస్

  • రెవిన్యూ, మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం విడాలి.
  • ⁠ఏ.4.26 గుంటలకు ఇచ్చిన ల్యాండ్ పొజిషన్ సర్టిపికెట్ ను రద్దు చేయాలి.
  • ⁠నిబంధనలకు విరుద్ధంగా పొజిషన్ సర్టిపికెట్ ఇచ్చిన తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలి

తేదీ 23-12-2024 రోజున కరీంనగర్ ప్రజావాణి లో పద్మనాయక కల్యాణ మండపం మూడు హల్స్ నిర్మాణాలకు నగరపాలక సంస్థ నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని వాటిని కూల్చి వేయాలని, ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాలను నిలిపివేయాలని, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ ఇచ్చిన వాటిని రద్దు చేయాలనీ, సర్టిపేకెట్ ఇచ్చిన తహసీల్దార్ ను సస్పెండ్ చేయాలనీ రెవిన్యూ డివిజన్ ఆఫిసర్ మరియు కరీంనగర్ నాగారపాలక సంస్థ కమీషనర్ గార్లకు పిర్యాదు చేయడం జరిగింది.
అనంతరం అల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కరీంనగర్ జిల్లా కార్యదర్శి బండారి శేఖర్ మీడియాతో మాట్లాడుతు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న మూడు పద్మనాయక ఫంక్షన్ హాల్స్ కు నగరపాలక సంస్థ నుండి ఎలాంటి నిర్మాణ అనుమంతులు లేకుండా అక్రమంగా నిర్మించారనీ గత నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ కి నగరపాలక సంస్థ కమీషనర్, ఆర్డివో మరియు కరీంనగర్ అర్బన్ తహసీల్దార్ గార్లకు పిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ పద్మనాయక మూడు ఫంక్షన్హాల్స్ కు ఫైర్ సేఫ్టీ, పార్కింగ్ స్థలాలు కూడా లేవని అన్నారు. ఈ ఫంక్షన్హాల్స్ ఆబాది భూమిని ఆక్రమించుకొని అక్రమంగా నిర్మాణాలు చేసుకున్నారని ఆరోపించారు. రెవిన్యూ , నగరపాలక సంస్థ అధికారులు భూ కబ్జాదారులతో, అక్రమ నిర్మాణ దారులతో కుమ్మక్కు అయ్యి పద్మనాయక పంక్షన్ హల్స్ పై విచారణ చేయడం లేదనీ ఆరోపించారు.
ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2023 సంవత్సరంలో రెఫరెన్స్ నెం: B/1211/2022 తేది: 31-01-2023 ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ ఏ. 4.26 గుంటలకు పద్మనాయక ఫంక్షన్ హల్స్, పద్మనాయక వసతి గృహం ఇంటి నెంబర్ లు :2-8-80, 2-8-81 పేరుతో ఇవ్వడం సిగ్గు చెటని విమర్శించారు. 2023లో అప్పటి తహసీల్దార్ ఇచ్చిన ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ సర్క్యూలర్ను తక్షణమే రద్దు చేయాలని, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన తహసీల్దార్ పై సమగ్ర విచారణ చేసి సస్పెండ్ చేయాలనీ డిమాండ్ చేశారు. .
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న పద్మనాయక ఫంక్షన్ హాల్ గత కొన్ని సంవత్సరాలుగా భూమిని ఆక్రమించి తప్పుడు పద్ధతిలో ల్యాండ్ పొజిషన్ సర్టిఫికెట్ తీసుకొని, కరీంనగర్ మున్సిపాలిటీ నుండి ఎలాంటి నిర్మాణ అనుమతులు లేకుండా మూడు ఫంక్షన్పోల్ ను అక్రమంగా నిర్మించుకొని ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతూ పెద్ద ఎత్తున ఆదాయం సమాకుర్చుకుంటున్నారని అన్నారు. కరీంనగర్ ఆర్డీవో, కరీంనగర్ అర్బన్ తహసిల్దార్ కి కూడా ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజావాణిలో ఇచ్చిన పిర్యాదులకె దిక్కులేదా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ చొరవ తీసుకొని పద్మనాయక ఫంక్షన్ హాల్స్ పై సమగ్ర విచారణ చేసి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వినతిపత్రం ఇచ్చిన వారిలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు కె. బద్రి నేత పాల్గొన్నారు.

బండారి శేఖర్
జిల్లా ప్రధాన కార్యదర్శి
ALL INDIA FORWARD BLOC (AIFB), Karimnagar

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page