TRINETHRAM NEWS

పరిటాల రవి 20వ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిననియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి

ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిటాల రవి 20వ వర్ధంతి సందర్బంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి. అనంతరం హన్మంతన్న మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిటాల రవి మంత్రిగా ఉన్న సమయంలో వారు ప్రజలకు చేసిన సేవలు గొప్పవని కొనియాడారు..అలాగే పేద ప్రజలకు అండగా నిలిచిన ప్రజా నాయకుడు పరిటాల రవి అన్నారు…

ఈ కార్యక్రమంలో ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ జెట్టి కుసుం కుమార్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, టీపిసీసీ జనరల్ సెక్రటరీ నర్సిరెడ్డి భూపతిరెడ్డి, కూకట్ పల్లి నియోజవర్గం ఇంచార్జ్ బండి రమేష్ గార్లతో పాటు బండి శ్రీనివాస్ గౌడ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, పులి సందీప్, మోతి శ్రీనివాస్ యాదవ్, అర్వ వెంకట్, గుమస్తా మధు, ప్రభాకర్ రెడ్డి నిర్వాహకులు నీలపాటి కరుణాకర్ రావు, సుండూరి అనంత చౌదరి, అంతయ్య, శశి, కోటేశ్వరరావు, వంశీ, రమేష్, శివాజీ, పరిటాల రవి అభిమానులు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App