TRINETHRAM NEWS

సింగరేణి యాజమాన్యం క్రచ్ ఏర్పాటు చేసి మహిళల ఉద్యోగస్తులకు కానుక ఇవ్వాలి సిఐటియు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో వివిధ గనులు, విభాగాల్లో పనిచేస్తున్న మహిళల ఉద్యోగస్తుల కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా క్రచ్ ఏర్పాటుపై సింగరేణి యాజమాన్యం ఆదేశాలు జారీ చేసి బహుమతిగా ఇవ్వాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూగా డిమాండ్ చేస్తున్నాము. గత మూడు సంవత్సరాలుగా సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో భూపాలపల్లిలో మొదలుపెట్టి అన్ని ఏరియాలలో మహిళా ఉద్యోగుల సమస్యలపై క్రచ్ ఏర్పాటు కోసం జీయం లకు వినతి పత్రాలు మరియు డైరెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చిన ఇప్పటివరకు ఎక్కడ ఆచరణలోకి తీసుకు రాలేదని,

మరోవైపు గెలిచిన సంఘాలు స్ట్రక్చర్ సమావేశంలో మాట్లాడమని దాటవేస్తున్నారే తప్ప ఆచరణలోకి తీసుకురావడం లేదని అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకోని స్ట్రక్చర్ సమావేశంలో యాజమాన్యంపై ఒత్తిడి తెచ్చి క్రచ్ ఏర్పాటుపై సింగరేణి యాజమాన్యం పై ఒత్తిడి తీసుకురావాలని గుర్తింపు సంఘానికి సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియుగా కోరుతున్నాం రామగుండం-1 బ్రాంచ్ అధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, కార్యదర్శి మెండె శ్రీనివాస్, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

occasion of International Women's Day