On the occasion of Clean Friday
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మేయర్ గార్ల ఆదేశాల మేరకు స్వచ్ఛ శుక్రవారం సందర్భంగా సీజన్ వ్యాధులు ప్రబలకుండా డివిజన్ లో స్వచ్ఛ కార్యక్రమం మరియు అవగాహన కార్యక్రమం….
45 డివిజన్ ప్రజలకు ఇంటింటి ప్రచార కార్యక్రమం లో భాగంగా పరిసరాల పరిశుభ్రత అవగాహన కార్యక్రమం చేపట్టిన కార్పొరేటర్ కొమ్ము వేణు, అంగన్వాడీ టీచర్లు, ఆర్పీలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఈరోజు జరిగిన కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ లో పెద్దపల్లి జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ మేయర్ అనిల్ కుమార్ ఆదేశానుసారం వర్షాకాల నేపథ్యంలో ఇంటి పరిసర ప్రాంతాల చెత్తాచెదారం మరియు ఎక్కువ రోజులు నీటి నిల్వ ఉన్న ప్రదేశాలలో దోమల వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని వీటిని నివారించేందుకు స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా డివిజన్ లో గడపగడపకు వెళ్లి ప్రజలకు అవగాహన కార్యక్రమం చేపట్టడం జరిగింది
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కొమ్ము వేణు మాట్లాడుతూ ఈరోజు డివిజన్ లో సీజన్ వ్యాధులు ప్రబలకుండా ఉండడం కోసం కార్పొరేటర్ కొమ్ము వేణు వెంట మున్సిపల్ వారు అంగన్వాడీ టీచర్లు ఆర్పీలు కలిసి ప్రజలకు స్వచ్ఛ కార్యక్రమం చేపట్టడంతో పాటు పరిసర ప్రాంతాలు అపర శుభ్రంగా ఉండడం వల్ల వ్యాధులు వ్యాప్తి చెందుతాయని ఎప్పటికప్పుడు స్వచ్ఛ కార్యక్రమాలు చేపడుతూ పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని గడపగడపకు వెళ్లి వారికి అవగాహన కార్యక్రమం చేపట్టి వారికి తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి డివిజన్ మున్సిపల్ సూపర్వైజర్ ఉమామహేశ్వర్, జనరల్ సెక్రెటరీ గులాం ముస్తఫా అంగన్వాడీ టీచర్లు ఆర్పీలు తోపాటు డాక్టర్ సాధిక్ భాష శశికళ. సంధ్య.స్వర్ణ. రాజేశ్వరి. సాధన.సాహిదా.సునీత.డివిజన్ మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు
ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి డివిజన్ ప్రజల పక్షాన కృతజ్ఞతలు తెలియజేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App