Trinethram News : Mar 29, 2024,
30న కౌటాలకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రాక
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈనెల 30వ తేదీన కౌటాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే బహిరంగ సభకు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క రానున్నట్లు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తెలిపారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తదితరులు హాజరవుతున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు.