2వ రోజు ధర్మ సమాజ్ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్షలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఉచిత విద్య, వైద్యం మరియు ఉపాధి, భూమి, ఇల్లు నిరాహార దీక్షలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో రెండవ రోజున ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో RDO Office దగ్గర ధర్మ సమాజ్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోని 3 కోట్ల మంది BC_ST_SC_EBC ప్రజలకు, అగ్రకుల పేదలకు ఉచిత విద్య, వైద్యం, మరియు ఉపాధి, భూమి, ఇల్లు సాధన కోసం 2వ రోజు నిరహార దీక్ష చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు విద్య, వైద్యం అందించకుండా బలహీన వర్గాల ప్రజలకు సమాధి కడుతుంది, కాబట్టి ప్రజలు ఈ దోపిడీ ప్రభుత్వాలకు సమాధి కట్టే యుద్ధానికి సిద్ధం కావాలని రవీందర్ మహారాజ్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ రవీందర్ మహారాజ్, కన్వీనర్లు వెంకటేష్, మల్లికార్జున్ వివిధ మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App