TRINETHRAM NEWS

సమ్మర్ సీజన్ లోపు ఒక వైపు పెద్దపల్లి కునారం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి (ఆర్.ఓ.బీ) సిద్దం జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*పెండింగ్ భూ సేకరణ డిమాండ్ నోటీస్ వెంటనే జారీ చేయాలి

పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ పనులు పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ కోయ హర్ష

పెద్దపల్లి, డిసెంబర్-31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రాబోయే సమ్మర్ సీజన్ లోపు పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ఒక వైపు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకుని రావాలని జిల్లా కలెక్టర్ కోయ హర్ష సంబంధిత ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.

మంగళవారం జిల్లా కలెక్టర్ కోయ హర్ష
పెద్దపల్లి కూనారం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, 119 కోట్ల 50 లక్షల వ్యయంతో పెద్దపల్లి కూనారం రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రభుత్వం నిర్మిస్తుందని తెలిపారు. పెద్దపల్లి కూనారం ఆర్.ఓ.బీ బ్రిడ్జి నిర్మాణానికి అవసరమైన పెండింగ్ భూ సేకరణ డిమాండ్ నోటీస్ జనరేట్ చేసి ఆర్ అండ్ బి అధికారులకు అప్పగించాలని కలెక్టర్ సంబంధిత రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు విడుదలైన నేపథ్యంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలని, వచ్చే సమ్మర్ సీజన్ లోపు కనీసం ఒకవైపు ఆర్.ఓ.బీ పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకుని రావాలని కలెక్టర్ ఆదేశించారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించిన సర్వీస్ రోడ్డు పనులు సమాంతరంగా జరగాలని, వీటిని సమ్మర్ నాటికి పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఈఈ ఆర్ &బీ భావ్ సింగ్, తహసిల్దార్ రాజ్ కుమార్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App