త్రినేత్రం న్యూస్, 04.10.2025 – శనివారం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆధ్వర్యంలో ఆయిల్ ఫామ్ రైతు ఆత్మీయ సమ్మేళనం
దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామ సమీపంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫామ్ రైతుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది ఈ సభలో, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ రైతులను ఉద్దేశించి మాట్లాడారు. పామాయిల్ సాగు రైతులకు బంగారు బాటగా నిలుస్తుందన్నారు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు వచ్చే పంటగా ప్రసిద్ధి చెందిందన్నారు ఆయిల్ ఫామ్ సాగులో రైతులు కొత్త పద్ధతులు నేర్చుకుంటే మరింత అధిక దిగుబడులు పొందగలరని సూచించారు. రైతులకు అవసరమైన సహాయం ప్రభుత్వం నుంచి అందించేలా కృషి చేస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,హాజరై రైతులతో కలిసి పామాయిల్ సాగు ప్రాధాన్యతను వివరించారు రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. ఈ సభలో పలు కంపెనీల ప్రతినిధులు రైతులకు కొత్త టెక్నాలజీ నూతన పద్ధతులు అధిక దిగుబడి సాధించే మార్గాలపై విలువైన సూచనలు ఇచ్చారు. గ్రామీణ ఆర్థికాభివృద్ధికి పామాయిల్ సాగు కీలకమని నాయకులు ఉద్ఘాటించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


