TRINETHRAM NEWS

ఖనిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు.

పండ్లు పంపిణీ చేసిన తెలుగు తమ్ముళ్లు

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, నటసామ్రాట్ బడుగు వర్గాల ఆశాజ్యోతి, ప్రజలవద్దకు పరి పాలనను నిజంచేసి నిరూపించిన మహోన్నతమైన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారకరామారావు
29వ వర్దంతి ని శనివారం గోదావరిఖని గాంధీనగర్ లోని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఘనంగా నిర్వహించారు.
తెలుగుదేశం పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు ముఖ్య అతిధిగా హాజరై, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తినటుక్ నాయకులు తిన్సప్ నాయకులు, మహిళ సంఘము నాయకులు హాజరై పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. గవర్నమెంట్ హాస్పిటలోని రోగులకు పండ్ల పంపిణీ, గాంధీ నగర్ లో ఉన్న అనాథ ఆశ్రమ చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. తెలుగు దేశం పార్టీ ఆఫీసు లో అన్న దానం నిర్వహించారు.
ఈకార్యక్రమములో దామోదర్ రెడ్డి, గుండబోయిన ఓదేలు, చిటికెల రాజలింగం,పెగడపెళ్లి రాజనర్సు,తిన్సప్ బేక్కం వీరేందర్, కోండి శ్రీనివాస్, నారెడ్డి స్వరాజ్యం, కుషి నర్మదా, చిట్యాల అశ్విని, బరిగెల కళావతి , రొడ్డ బాణమ్మ, రామగిరి రాజేశ్వరి, సుందిళ్ళ స్వామి,సల్ల రవీందర్ రాజబాబు,ఈసం రాజలింగం, లింగమ్మ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App