WhatsApp Image 2024 05 28 at 14.51.58
NTR’s birth anniversary celebrations in Khani
జాతి గర్వించదగ్గ ముద్దుబిడ్డ నందమూరి నిమ్మకాయల ఏడుకొండలు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం నియోజకవర్గ గోదావరిఖని గాంధీనగర్ లోని తెలుగుదేశం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కార్యాలయంలో మంగళవారం నటరత్న పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు 101వ జయంతిని పురస్కరించుకొని నిమ్మకాయలు ఏడుకొండలు జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా ముదిగంటి దామోదర్ రెడ్డి, మహిళా నాయకులు సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అదేవిధంగా పెగడపల్లి రాజనర్సు సింగరేణి టిఎన్ టియు సి అండ్ ఆఫీసు ఇంచార్జి కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం గోదావరిఖని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో పేషెంట్స్ కు పండ్లు పంపిణీ చేశారు.
డాక్టర్ నందమూరి తారక రామారావు కళా రంగంలో విభిన్న పాత్రలు పోషించి సమాజ హిత పాత్రలు చేసి ప్రజల మనసుల్లో నిలిచిపోయారన్నారు. 9నెలల అనతికాలములోనే కూడు గూడు గుడ్డ అన్న నినాదంతో రాజకీయ రంగంలో ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఘనత డాక్టర్ నందమూరి తారకరామారావు దక్కిందని రాష్ట్ర పార్టీ కార్యదర్శి, సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు అన్నారు
ముదిగంటి దామోదర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి అధ్యక్షుడు, టి ఎన్ టి యు సి పెద్దపల్లి పార్లమెంట్ ఉపాధ్యక్షుడు సల్ల రవీందర్, చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ సెక్రటరీ, పెగడపల్లి రాజనర్సు సింగరేణి టి ఎన్ టియు సి అండ్ సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి అండ్ ఆఫీసు ఇంచార్జ్, సిహెచ్ మల్లయ్య ఆర్జి 2 సింగరేణి టిఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, కనకం పోచమ్మల్లు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, గుండెబోయిన ఓదెలు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, నరెడ్డి స్వరాజ్యం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా కార్యదర్శి, బరిగల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి, మాటేటి లక్ష్మి టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షురాలు, చిట్యాల అశ్విని రాష్ట్ర మహిళా కార్యదర్శి, టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బెక్కం వీరేందర్, సంగెపు రాజు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, కామెరా రాజబాబు సీనియర్ తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ నాయకులు, రామగిరి రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ సీనియర్ టౌన్ కార్యదర్శి, బండారి స్రవంతి పెద్దపల్లి పార్లమెంట్ కార్యదర్శి, కొండి శ్రీనివాస్ ఆర్జి 2 టిఎన్టిసి ప్రచార కార్యదర్శి, బీసీ సెల్ కార్పొరేషన్ అధ్యక్షులు, సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి, బండారి రాజకుమార్ తెలుగుదేశం పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
