NTR thanked CBN-Pawan
Trinethram News : యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా థాంక్స్ చెప్పారు. కారణం ఏపీలో దేవర టికెట్ రేట్స్ పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం అనుమతినివ్వడం పట్ల సోషల్ ఇండియా వేదికగా మామయ్య చంద్రబాబు కి, పవన్ కళ్యాణ్ కు ప్రత్యేక కృతఙ్ఞతలు తెలియజేసారు.
సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్న దేవర చిత్రానికి తెలంగాణ నుచి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా.. ఏపీలో టికెట్ రేట్స్ పెంపు విషయంలో తర్జనభర్జన నడుస్తుంది. కానీ ఇప్పుడు దేవర సినిమా టికెట్ల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతినిచ్చింది. మల్టీప్లెక్స్ లో ఒక్కో టికెట్లపై రూ.135 వరకూ పెంచారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో అప్పర్ క్లాస్ ఒక్కో టికెట్ పై రూ.110, లోయర్ క్లాస్ ఒక్కో టికెటైపై రూ.60 వరకూ పెంచుకోవడానికి పర్మిషన్..
అంతేకాకుండా రిలీజ్ రోజున అంటే సెప్టెంబర్ 27 తెల్లవారు ఝామున 12AM నుంచి మొత్తం 6 షోల అనుమతి నిచ్చిన ఏపీ ప్రభుత్వం 28వ తేదీ నుంచి 9 రోజులపాటు రోజుకు 5షోల ప్రదర్శనకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానితో ఎన్టీఆర్ My heartfelt gratitude to the Honorable CM, Sri @NCBN garu, and Honorable Deputy CM, Sri @PawanKalyan garu of the Andhra Pradesh government for passing the new G.O. for the #Devara release and for your continued support of Telugu cinema. I’m also thankful to Cinematography Minister, Sri @kanduladurgesh Garu అంటూ థాంక్స్ చెప్పిన ట్వీట్ వైరల్ అయ్యింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.