
Not a Protest : యన్ టి ఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జిల్లా కేంద్రమైన విజయవాడలో వైసిపి చేపట్టిన నిరసనపై తెలుగుదేశం పార్టీ నేత బుద్దా వెంకన్న మండిపడ్డారు. వాళ్లు చేసింది నిరసన కాదు, అరాచకం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ డీఎస్పీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
అయితే ఆ డీఎస్సీ అభ్యర్థుల నియామకాలు పారదర్శకంగా జరిగాయని స్పష్టం చేశారు. క్రీడలకోట ఉద్యోగులతో యువత సంతోషంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. విద్యా మరియు ఐటీ మంత్రి లోకేష్ పై ఆ వైసిపి అసూయతోనే రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. ప్రజలు జగన్ మాటలు వినే పరిస్థితుల్లో లేరని అన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe