TRINETHRAM NEWS

No one will be spared in phone tapping case: CP Kota Kota Srinivas Reddy

Trinethram News : ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంపై సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఈ కేసులో కీలక నిందితులు ఇప్పటికే అరెస్టు చేశామన్న ఆయన.. ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్‌ని కోరామని చెప్పారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు జారీ చేసిన తర్వాత వారిని దేశానికి తీసుకొస్తామని తెలిపారు.

సీబీఐ డైరెక్టర్ ను తానే స్వయంగా కలిసి కేసు స్వరూపాన్ని వివరించానని తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సీపీ.. ఈ కేసుతో సంబంధం ఎవరని వదలమని.. ప్రతి ఒక్కరిని విచారిస్తామని తేల్చి చెప్పారు. కాగా బీఆర్ఎస్ హాయాంలో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు టాపింగ్ అయ్యాయంటూ రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

No one will be spared in phone tapping case: CP Kota Kota Srinivas Reddy