WhatsApp Image 2025 01 28 at 20.22.14
కూలిన సలీంనగర్ బ్రిడ్జిని పరిశీలించిన ఎన్ఎండి ఫిరోజ్
నంద్యాల జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
నంద్యాల స్థానిక 35 వ వార్డు సలీంనగర్ నందు గత వైసిపి ప్రభుత్వ హయాంలో నిర్మించిన బ్రిడ్జి నేడు ప్రమాదవశాత్తు కూలిపోవడంతో ఆ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ వారి బృందంతో అక్కడికి వెళ్లి కూలిన బ్రిడ్జిని పరిశీలించడం జరిగింది
అనంతరం వారు మాట్లాడుతూ 2017 లో తెలుగుదేశం పార్టీ హయాంలో శాంక్షన్ అయిన బ్రిడ్జిని అనంతరం 2019 లో అధికారం చేపట్టిన వైసీపీ ప్రభుత్వం కమిషన్లకు కక్కుర్తి పడి నాసిరకమైన బ్రిడ్జిని నిర్మించడంతో ఈరోజు ఆ బ్రిడ్జి కూలిపోయిందని . అక్కడ జనాలు తిరగకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పిందన్నారు బ్రిడ్జి తో పాటు దాని ఆనుకోని ఉన్న స్తంభాలు కూడా పడిపోవడంతో పెద్ద పెను ప్రమాదమే తప్పిందని తెలిపారు ఇలాంటి బ్రిడ్జి నిర్మించిన కాంట్రాక్టు పై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు . ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సమన్వయకర్త సుధాకర్ , టిడిపి వార్డు ఇన్చార్జిలు , నాయకులు , కార్యకర్తలు , ప్రజలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
