
Illegal Hostel must Seized : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 24, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలోని ‘ఎస్పీఆర్ హైస్కూల్‘ నిర్వహిస్తున్న అనధికారిక తరగతులు, నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న అక్రమ నివాస హాస్టల్‌ను తక్షణమే సీజ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ) కార్యాలయ సూపరింటెండెంట్ పవన్ కుమార్‌కు గురువారం చట్టబద్ధమైన వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సమాచార హక్కు సేవా సొసైటీ (ఆర్టీఐఎస్ఎస్) వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు కేతావత్ బాబురామ్ నాయక్, వైఎస్సార్ విద్యార్థి విభాగం (వైఎస్సార్‌ఎస్‌యూ) జిల్లా అధ్యక్షులు ఎండి. సిరాజ్ మాట్లాడుతూ.. గత నెల 03-08-2026 నాడు కొండమల్లేపల్లి ‘ఎస్పీఆర్ హైస్కూల్’ చేస్తున్న చట్ట ఉల్లంఘనలపై జిల్లా కలెక్టర్‌కు స్వయంగా ఫిర్యాదు చేయగా, వెంటనే క్షేత్రస్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ విద్యాశాఖ అధికారులు కనీస తనిఖీలు చేపట్టకుండా తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. అధికారుల ఉదాసీనత వల్లే అనుమతులు లేని పాఠశాల, అగ్నిమాపక భద్రత లేని అక్రమ హాస్టల్ యథేచ్ఛగా కొనసాగుతున్నాయని ఆరోపించారు.
పాఠశాల పేరు మార్పు, గుర్తింపు వ్యవహారం ప్రస్తుతం గౌరవ తెలంగాణ హైకోర్టు, రంగారెడ్డి జిల్లా వాణిజ్య న్యాయస్థానం (కమర్షియల్ కోర్టు) పరిధిలో న్యాయ విచారణలో ఉన్నప్పటికీ, హైదరాబాద్ ప్రాంతీయ పాఠశాల విద్యాశాఖ సంయుక్త సంచాలకుల (ఆర్‌జేడీఎస్‌ఈ) ఉత్తర్వులను సైతం బేఖాతరు చేస్తూ ఏ అధికారంతో పాఠశాలను కొనసాగిస్తున్నారో లిఖితపూర్వకంగా బహిర్గతం చేయాలని నిలదీశారు. తక్షణమే అక్రమ ప్రవేశాలు, బోర్డులు, తరగతులను నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, అనుమతులు లేని నివాస హాస్టల్‌ను సీజ్ చేయడంతో పాటు కలెక్టర్ ఆదేశాలపై తీసుకున్న చర్యల సమగ్ర నివేదికను అందజేయాలని డిమాండ్ చేశారు.
ఈ వినతిపత్రంపై విద్యాశాఖ అధికారులు మూడు రోజుల్లోగా స్పందించాలని, వారం రోజుల్లోగా అక్రమ పాఠశాల, హాస్టల్‌పై క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు తీసుకోకపోతే హైకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేయడంతో పాటు విజిలెన్స్ మరియు ఎన్ఫోర్స్మెంట్ విభాగానికి సమగ్ర విచారణ కోసం ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కేతావత్ బాబురామ్ నాయక్ (9959054491), ఎండి. సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe