TRINETHRAM NEWS

ఆశ్రమ పాఠశాలలో గిరిజన విద్యార్థి నిల ఆరోగ్యం పై నిర్లక్ష్య వైఖరి !
ఎస్ఎఫ్ఐ నాయకుడు ఎస్ ఐసుబాబు.

అల్లూరి జిల్లా అరకులోయ.జనవరి 9.త్రినేత్రం న్యూస్.

సిరగం పంచాయతీ పీవీటీజీ గ్రామమైన దిబ్బ వలస కీ చెందినా సోడాపల్లి రత్న.(తండ్రి కృష్ణారావు)అరకువేలి మండలం కొత్తబల్లగూడ ఆశ్రమ పాఠశాలలో 9.వ తరగతి చదువుతున్నది.ఈమెను ఈరోజు అరకువేలి ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గత ఆదివారం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న విద్యార్థిని మంగళవారం నుండీ పాఠశాల యాజమాన్యం ఒక్క టాబ్లెట్ ఇచ్చి తగడం లేదని విద్యార్థిని తల్లిదండ్రులకు మంగళవారం ఫోన్ చేసి స్కూల్ కి వచ్చి మీ పాపని ఇంటికి తీసుకువెళ్ళిపోమని చెప్పడం జరిగింది .కనీసం హాస్పిటల్ కి కూడా తీసుకువెళ్లలేని స్కూల్ యాజమాన్యం చాలా నిర్లక్ష్య ధోరణిని ప్రవర్తిస్తున్నారు.

ఐతే విద్యార్థిని ఆరోగ్యం యింకా కుదుటపడలేదు .. ఏదయినా ప్రమాదం జరిగిన ఉంటె ఏం ఆవ్వాలి ఆని తల్లి తండ్రులు బాధపడుతున్నారు.వెంటనే స్కూల్ హెచ్ఎం మరియు వార్డెన్ దీనికి స్పందించాలని విద్యార్థిని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఏ మాత్రం బాధ్యత లేకుండా స్కూల్ పిల్లల్ని వదిలేయడం ఇది కరెక్ట్ కాదు వెంటనే హెచ్ఎం మేడం మరియు వార్డెన్ బాధ్యత తీసుకొని వైద్యం కొరకు బాధ్యత వహించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది ఆని ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్ ఐసుబాబు త్రినేత్రం న్యూస్ ఛానల్ కు తేలియపరిచారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App