ఆగస్ట్ 5, 2026
TRINETHRAM NEWS
Negligence

ప్రజా సమాచార అధికారికి రూ.10,000 జరిమానా విధించిన తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్.

Negligence : దేవరకొండ డివిజన్ జులై 30, త్రినేత్రం న్యూస్ : సమాచార హక్కు చట్టం–2005 (RTI Act–2005) అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ప్రజా సమాచార అధికారిపై తెలంగాణ రాష్ట్ర సమాచార కమిషన్ (SIC) కఠిన చర్యలు తీసుకుంది. చట్టం నిర్దేశించిన గడువులోగా సమాచారాన్ని అందించకపోవడంతో సంబంధిత ప్రజా సమాచార అధికారి (PIO)కి రూ.10,000 జరిమానా విధిస్తూ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీమతి మొహ్సిన్ పర్వీన్ ఆదేశాలు జారీ చేశారు.

వివరాల్లోకి వెళితే, నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలంలోని పోల్కంపల్లి సాంఘిక సంక్షేమ బాలుర వసతిగృహానికి సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం–2005 ప్రకారం దరఖాస్తు ద్వారా కోరినప్పటికీ, ప్రజా సమాచార అధికారి చట్టబద్ధమైన 30 రోజుల గడువులోగా సమాచారం ఇవ్వలేదు. సాంఘిక సంక్షేమ జిల్లా అధికారి కి మొదటి అప్పీల్ చేసిన సమాచారం రాలేదు . దీంతో సమాచార హక్కు చట్టం ప్రకారం ద్వితీయ అప్పీల్ దాఖలు చేయబడింది.

ఈ మేరకు అప్పీల్ నెం. 10382/SIC-MP/2026పై సోమవారం (27-07-2026) హైదరాబాద్‌లోని M.J.మార్కెట్ సమీపంలో ఉన్న సమాచార హక్కు భవన్, కోర్టు హాల్–2లో విచారణ నిర్వహించారు. ఈ విచారణకు అప్పీలుదారుగా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఆక్టివిస్ట్ సొసైటీ (RTIAS) రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ స్వయంగా హాజరై తమ వాదనలు వినిపించారు.
విచారణ సందర్భంగా ప్రజా సమాచార అధికారి నిర్లక్ష్య ధోరణిపై రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీమతి మొహ్సిన్ పర్వీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమాచార హక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రజా సమాచార అధికారి ప్రజలకు సకాలంలో సమాచారాన్ని అందించడం చట్టబద్ధమైన బాధ్యత అని, ఆ బాధ్యతను విస్మరించడం చట్ట ఉల్లంఘనతో సమానమని ఆమె స్పష్టం చేశారు.
ఈ నేపథ్యంలో సంబంధిత ప్రజా సమాచార అధికారిపై రూ.10,000/- జరిమానా విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా RTIAS రాష్ట్ర అధ్యక్షులు డా. కొర్ర కిషన్ నాయక్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం ప్రజలకు పారదర్శక పాలనను అందించే అత్యంత శక్తివంతమైన చట్టమని పేర్కొన్నారు. సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగా నిలిపివేసే లేదా ఆలస్యం చేసే అధికారులపై కమిషన్ కఠిన చర్యలు తీసుకోవడం అభినందనీయమని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page