Trinethram News : Feb 12, 2026, నాసా యొక్క నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ భూమి దిశగా కదులుతోంది. వాతావరణ రాపిడి కారణంగా దాని కక్ష్య 585 కిలోమీటర్ల నుంచి 400 కిలోమీటర్లకు చేరింది. దీంతో సైన్స్ కార్యకలాపాలు నిలిపివేసి, రీబూస్ట్ మిషన్ ద్వారా యథాస్థితికి చేర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
2004లో ప్రయోగించిన ఈ టెలిస్కోప్ గామా కిరణాల పేలుళ్లను అధ్యయనం చేస్తుంది. సౌర కార్యకలాపాల వల్ల భూమి ఎగువ వాతావరణం వేడెక్కడంతో ఇది కక్ష్య నుంచి కిందికి రావడం ప్రారంభమైంది.
2026 చివరి నాటికి భూ వాతావరణంలోకి ప్రవేశించి కాలిపోయే అవకాశం ఉన్నప్పటికీ, నాసా దాని సేవలను కొనసాగించడానికి ప్రయత్నిస్తోంది.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


