Trinethram News : నందిగామ: తెదేపా అధినేత చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించేనని ఆయన సతీమణి నారా భువనేశ్వరి అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలోని చందర్లపాడు మండలం కోనాయపాలెంలో ఆమె పర్యటించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపానికి గురై గుండెపోటుతో మృతి చెందిన వనపర్తి మల్లికార్జున కుటుంబసభ్యులను పరామర్శించారు. మల్లికార్జున చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబానికి రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. తెదేపా అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
చంద్రబాబు అక్రమ అరెస్టుతో మనస్తాపానికి గురై మృతి చెందిన వారిలో ఇప్పటివరకు 60 కుటుంబాలను పరామర్శించానని భువనేశ్వరి తెలిపారు. ఇంకా 160 కుటుంబాలను పరామర్శించాల్సి ఉందని చెప్పారు. చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పరామర్శించి ధైర్యం చెప్పాలని తనతో అన్నారని గుర్తుచేశారు. అందుకే ‘నిజం గెలవాలి’ చేపట్టానన్నారు. రానున్న 50 రోజుల్లో కురుక్షేత్ర మహా సంగ్రామం జరుగుతుందని.. తప్పకుండా మనమే గెలుస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఆలోచనలు ఎప్పుడూ ప్రజల బాగోగుల గురించే నారా భువనేశ్వరి
Related Posts
NTR : స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి
TRINETHRAM NEWS తేదీ:18/01/2025స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి.విస్సన్నపేట:( త్రినేత్రం న్యూస్): విలేఖరిఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరువూరు నియోజకవర్గం, పుట్రెల గ్రామపంచాయతీ, వీర రాఘవపురంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్ ఎన్టీఆర్ నినాదాలు చేయడం…
ఘనంగా వర్ధంతి
TRINETHRAM NEWS తేదీ:18/01/2025.ఘనంగా వర్ధంతితిరువూరు నియోజకవర్గం 🙁 త్రినేత్రం న్యూస్): విలేఖరి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఎన్టీఆర్ జిల్లా, విస్సన్నపేట మండలంలో బస్టాండ్ సెంటర్ నందు సీనియర్ నందమూరి తారక రామారావు 29 వ వర్ధంతి నీ తెలుగుదేశం పార్టీ సీనియర్…