
Trinethram News : AP: TDP అధినేత చంద్రబాబు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న (శనివారం) నిర్వహించిన TDP పొలిట్ బ్యూరో సమావేశంలో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా నారా భువనేశ్వరి పేరును ఖరారు చేసినట్లు సమాచారం. ఎంపీ కేశినేని నాని TDPకి రాజీనామా చేసి YCPలో చేరడంతో ఆయన తమ్ముడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్నికి లైన్ క్లియర్ అయ్యిందని అందరూ భావించారు. కానీ, అనూహ్యంగా నారా భువనేశ్వరి పేరు తెరపైకి వచ్చింది.
