మున్సిపల్ పారిశుధ్య కార్మికుల బకాయి జీతాలు తక్షణమే చెల్లించాలి.
కాకినాడ,మే,09: మున్సిపల్ పారిశుద్ధ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలని దేశవ్యాప్తంగా మే 20న జరిగే సార్వత్రిక సమ్మె లో మున్సిపల్ పాల్గొనేందుకు శుక్రవారం ఉదయం కాకినాడలో స్థానిక మున్సిపల్ కార్యాలయం లో మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ పృద్వి చరణ్ కి ఏపీ మున్సిపల్ వర్కర్స్ AITUC అనుబంధ సంఘం కాకినాడ కమిటీ ఆధ్వర్యంలో సమ్మె నోటీస్ అంద చేయడమైనది. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావు మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను (ఆప్కాస్ వర్కర్స్) పర్మినెంట్ చేయకుండా రిటైర్మెంట్ పేరుతో వారిని విధుల నుండి తొలగించారని, కనీసం ముందస్తు సమాచారం గా ఏ విధమైన నోటీసులు ఇవ్వకుండా విధుల నుండి తొలగిస్తున్నారని ఆయనఆవేదన వ్యక్తం చేసారు. 60 సంవత్సరాల వయోపరిమితి 62 సంవత్సరాలకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేసి వారి కుటుంబాలను ఆదుకోవాలని, వారసత్వ హక్కుగా కుటుంబీకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆయన అన్నారు.
కాకినాడ స్పెషల్ శానిటేషన్, టాయిలెట్ వర్కర్స్ లకు సుమారు ఐదు నెలలుగా జీతాలు చెల్లించలేదని, కార్మికులకు జీతాలు సకాలంలో మంజూరు కాక తీవ్ర ఇబ్బందులకు గురవుతూ అప్పులు ఊబిలో కరుకుపోతున్నారని, ప్రభుత్వం వెంటనే వారికి బకాయి జీతాలు చెల్లించాలని, మే 20వ తేదీన జరిగే దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెలో మున్సిపల్ కార్మికులు పనులు నిలుపుదల చేసి సమ్మెలో పాల్గొంటామని ఆయన అన్నారు.
యూనియన్ ప్రధాన కార్యదర్శి తుపాకుల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కాకినాడ స్పెషల్ శానిటేషన్, టాయిలెట్ కార్మికులకు జీతాలు పెండింగ్లో లేకుండా ప్రతినెల 1వ తేదీ నుండి 5వ తేదీ లోపు చెల్లించాలని, బిల్లులు మంజూరు చేయడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని, మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు దుర్భరమైన జీవితాలు గడుపుతూ విధులు నిర్వహిస్తున్నారని వారికి నెల జీతాలు పూర్తిస్థాయిలో బిల్లులు చేయకుండా నాగాలతో బిల్లులు చేస్తూ కార్మికుల జీవితాలతో చెలగాడ వాడుతున్నారని, పెండింగ్ బిల్లులు మంజూరు కోసం ఆఫీసు కార్యాల చుట్టూ ప్రదర్శన చేస్తున్నారని, ఇప్పటికైనా అధికారులు చిత్తశుద్ధిగా పనులు నిర్వహించకపోతే వారిపై యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బంగారు రాజేష్, సింగంపల్లి రమణ, జనపల్లి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


