TRINETHRAM NEWS

సమగ్ర కుటుంబ సర్వేకుసహకరించాలి : మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్

తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేకు వికారాబాద్ మున్సిపల్ ప్రజలందరూ సహకరించాలని, ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఈ సర్వే ఎంతగానో ఉపయోగపడుతుందని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. తెలంగాణ గౌరవ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో సమగ్ర కుటుంబ సర్వే కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని చైర్ పర్సన్ తెలిపారు. ఈరోజు 28వ వార్డు గాంధీ కాలనీలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో చైర్ పర్సన్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ… ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ లబ్ధి మరియు అన్ని కులాలకు సమన్యాయం చేకురుతుందని అన్నారు.దేశంలోనేమొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలోనే ఈ సర్వే ప్రారంభించడం జరిగింది. ఈ సర్వే ద్వారా రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకొని వారికి ఏమి కావాలో అనేది ప్రభుత్వం తెలుసుకొని.. భవిష్యత్తు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి ఎంతగానోఉపయోగపడుతుందని అన్నారు.అందువల్లసర్వేలోఎన్యుమరేటర్లు అడిగే 75 ప్రశ్నలకు సరైన సమాధానం ఇవ్వాలని ప్రజలను కోరారు. ఎన్యుమరేటర్లు సర్వే కోసం మీ ఇంటికి వచ్చే సమయానికి మీ కుటుంబంలో ఉన్న వారి అందరి ఆధార్ కార్డులు, రేషన్ కార్డు, స్థిర చర ఆస్తుల వివరాలు, బ్యాంకు లోన్ తదితర సమాచారాన్ని అందుబాటులో ఉంచుకొని ఓపికగా సమాధానాలు ఇస్తూ వారికి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వికారాబాద్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ కుమార్, స్థానిక కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్,ఎమ్మార్వోలక్ష్మీనారాయణ, కమిషనర్ జాకిర్ అహ్మద్, నాయకులు మోముల రాజ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, ఆర్పీలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App