TRINETHRAM NEWS

Move to fulfill the promises made by the state government to the people

ఈనెల 22న చలో హైదరాబాద్ లో పాల్గొనండి

సిపిఐ ( ఎంఎల్) మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిది అధికారంచేజిక్కించుకున్నంక ప్రజలకు ఇచ్చిన వాగ్దానం తుంగలో తొక్కిందని సిపిఐ (ఎంఎల్) మాస్ లైన్ రాష్ట్ర కమిటీ ప్రచురించిన గోడపత్రిలను ఈరోజు20:08:2024 నాడు కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ ప్రజా పంథా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని
ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని
అర్హులైన వారందరికీ ప్రభుత్వం వాగ్దానం ప్రకారం పెన్షన్లు ఇవ్వాలని జీవన భృతి ఇవ్వాలని
రైతాంగ రుణాలను రద్దు చేయాలని. కొత్త రుణాలు ఇవ్వాలి. పంట బీమా పథకం వెంటనే అమలు చేయాలని. వాస్తవ సాగుదారులందరికీ రైతు భరోసా అందించాలి. 20 ఎకరాల లోపు ఉన్నవారిని ఎంపిక చేసి 10 ఎకరాల వరకు రైతు భరోసా అందించాలి.
కౌలు రైతులకు గుర్తించి నిర్దిష్ట చర్యలు చేపట్టాలి.
ధరణి సమస్యలను వెంటనే పరిష్కరించాలి.వ్యవసాయ కార్మికులకు ప్రకటించిన 12000 జీవన భృతి వెంటనే అమలు చేయాలి. జీవన వ్యవసాయానికి అనుగుణంగా పెంచాలి.
భవన నిర్మాణ ఇత ఆసంగటిత కార్మికులకు సెలవులతో కూడిన కనీస వేతనాలను అమలు చేయాలి.
కాంటాక్ట్ అవుట్ సోర్సింగ్ కార్మికులను రెగ్యులేజర్ చేయాలి. స్కాలరను ఫీజు రీయింబర్స్మెంట్. ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించాలి.
నిరుద్యోగ ఖాళీలపై శ్వేత ప్రకారం ప్రకటించి. జాబ్ క్యాలండర్లను విడుదల చేయాలి.
పోడు సాగుదారులందరికీ పట్టాలను. సాగు హక్కులను కల్పించాలి.
ఆటో కార్మికులకు ఏడాదికి 12,000 ఇవ్వాలి.
సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. పై డిమాండ్ల సాధనకై ఆగస్టు 22న హైదరాబాద్ ఇందిరా పార్కులో జరుగు ధర్నా ను జయప్రదం చేయాల్సిందిగా పిలుపునిచ్చారు వివిధ డిమాండ్లతో కూడిన గోడ పత్రికను ఈరోజు ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ ప్రజా పంథా జిల్లా నాయకులు తోకల రమేష్, ఆడెపు శంకర్, గూడూరి వైకుంఠం, కలువల రాయమల్లు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App


Move to fulfill the promises made by the state government to the people