
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ అరకులోయ ఏప్రిల్ 16: మలేరియా మరియు డెంగ్యూ వ్యాధుల నివారణకు తీసుకుంటున్న ముందస్తు చర్యలలో భాగంగా అరకు శాసనసభ్యులు రేగం మత్స్యలింగం దోమల మందు పిచికారి మొదటి విడత కార్యక్రమాన్ని ఈ రోజు అధికారికంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం అరకు నియోజకవర్గంలోని అరకు వ్యాలీ మండలం, మాడగడ పిహెచ్సి పరిధిలోగల రవ్వలగూడ గ్రామంలో నిర్వహించబడింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, “ఏజెన్సీ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తుండటంతో నీటి నిల్వలు ఏర్పడి దోమల సంఖ్య అధికమవుతోంది. దాంతో మలేరియా, డెంగ్యూ వంటి వ్యాధుల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అందుకే గ్రామాల్లో దోమల మందు పిచికారి చేపట్టడం ద్వారా ఈ వ్యాధుల నివారణకు కృషి చేస్తున్నాం,” అని పేర్కొన్నారు.
అనంతరం ఆయన పిహెచ్సి సిబ్బందితో కలిసి ఇంటింటికి తిరిగి ప్రజలకు మలేరియా, డెంగ్యూ విష జ్వరాలపై అవగాహన కల్పిస్తూ, పరిశుభ్రత పాటించేలా సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి విశాఖపట్నం ఎస్టి సెల్ మాజీ జిల్లా అధ్యక్షుడు కమిడి అశోక్, మడగడ పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కమల, వైసిపి డుంబ్రిగూడ మండల అధ్యక్షుడు పాంగి పరశురామ్, మాజీ ఉప సర్పంచ్ పల్టసింగి విజయ్ కుమార్, డి.ఎమ్.ఓ తులసి రాజ్, ఏ.ఎమ్.ఓ సత్యం, కన్సల్టెంట్ శ్రీను, హెచ్.ఈ.ఎం భద్రం, ఎస్.యు.ఓ కుమారి, పిహెచ్సి హెచ్.వి ముత్యాలమ్మ, ఎం.టి.ఎస్ సుజాత, ఏ.ఎన్.ఎం తుల, హెల్త్ అసిస్టెంట్ చిన్న, బూర్జ కామేష్ ఆశ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
