
Trinethram News : ప్రధాని మోదీ నేటి నుంచి మూడు రోజుల పాటు తెలంగాణతో సహా ఐదు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. నేడు ఆయన ఆదిలాబాద్ లో రూ.56,000 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. సంగారెడ్డిలో రూ.6,800 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రారంభించి.. బహిరంగసభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత తమిళనాడు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్లో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.
