TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 26: అరకువేలి మండలం మాదల పాలమా నువలస చిట్టంగొంది మేదర సోల గ్రామాల్లో మౌలిక సౌకర్యాలు మంచినీరు, రోడ్డు, డ్రైనేజ్ వంటి సౌకర్యాలు లేక గిరిజనులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం మండల నాయకులు పి రామన్న అన్నారు. ఈ రోజు మాదల సచివాలయం ముందు ధర్నా చేయడం జరిగింది 2014 నుండి హుద్యుత్ తుపాన్ నష్టపోయిన గ్రామాలకు 35 కుటుంబాలకు మోడల్ కాలనీ మంజూరు చేసి ఇల్లు లు నిర్మాణంచేశారు.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి సమస్యలు పరిష్కారం కావడం లేదని తెలిపారు ఎన్నికల ముందు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కనీసం మంచినీరు సిసి రోడ్డు డ్రైనేజ్ సదుపాయం కల్పించకుండా నిర్లక్ష్యం చేస్తుంది అన్నారు, ఈ సమస్యలు పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మండల స్థాయి పోరాటాలు ఉదృతం చేస్తామని ప్రభుత్వం హెచ్చరిక జారీ చేయడం జరిగింది.

సిపిఎం పంచాయితీ నాయకులు జి చందు మాట్లాడుతూ పంచాయతీ ప్రజాప్రతినిధులు కనీసం పంచాయితీ పరిధిలో రోడ్లు మంచినీళ్లు డ్రైనేజీ సమస్యల కోసం పట్టించుకునే నాధుడు లేడని, ఎన్నికల దగ్గర వస్తే ప్రజలతో వెళ్లి మాయమాటలు చెప్పి మోసం చేసి గెలిచిన ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఎక్కడ పోయారని మా గ్రామాలకు రాకుండా సమస్యలుమోకం చటుకొని తిరుగుతున్నారు అన్నారు.

ఈసమస్యలు పరిష్కారం చేయకపోతే ప్రజా ఉద్యమాలు తీవ్రంగా చేపడతామన్నారు.ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న అధికారులకు స్థానిక ఎన్నికలలో బుద్ధి చెబుతారు అని తెలిపారు సిపిఎం పంచాయతీ నాయకులు కె అప్పన్న, బి అప్పారావు, జి ఆనందు, పి రూప, గ్రామస్తులు కె సోంబ్ర ,మాలతీ, జి సింగ్రు ది పాయి తదితరులు, పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Model Colony village should