Trinethram News : హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్సీ కవిత.. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఆలయ అర్చకులు, నిర్వాహకులు ఘనంగా స్వాగతం పలికారు.. పూజ అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు : రాష్ట్ర ప్రజలకు హనుమాన్ జయంతి శుభాకాంక్షలు.తెలంగాణ ప్రజలందరికీ హనుమంతుడి అనుగ్రహం లభించాలి. హనుమంతుని దయతో ప్రతి ఒక్కరి జీవితాలు విజ్ఞానంతో నిండి ఉండాలి. ప్రతి ఒక్కరిలో భక్తి భావం ఉండాలి. హనుమంతుడి కృప ఎల్లప్పుడూ తెలంగాణ ప్రజలపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


