తేదీ : 28/11/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); తిరువూరు నియోజకవర్గం, మండలం, మల్లెల గ్రామంలో డైనమిక్ శాసనసభ్యులు కొలిక పూడి. శ్రీనివాసరావు పకృతి వ్యవసాయ వనరుల కేంద్ర దుకాణమును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం ఆ దుకాణంలో ఉన్నటువంటి పకృతిలో లభించే ఆకులు, పశువుల పేడ, సహజ సిద్ధమైన వనరులతో తయారుచేసిన కషాయాలను, ఎరువలను ఆయన పరిశీలించారు. వాటిని ఎలా తయారు చేస్తారు అని అక్కడ ఉన్న సంబంధిత అధికారులను అడిగారు.
అదేవిధంగా వాటి తయారీ విధానాలను అన్నిటిని పరిశీలించి , అక్కడ పలు రకాల విత్తనాలను సమాజ సిద్ధముగా పండించేందుకు అతను పొలంలో చల్లడం జరిగింది. అధిక ఉత్పత్తి వస్తుందని ఎరువులను వాడుతున్నామని, దాని వలన పండించే కూరగాయలు మరియు పండ్లు మొదలగు వాటిలో కృత్రిమ ఎరువుల యొక్క అవశేషాలు ఉంటున్నాయని అధికారులు తెలిపారు.. మన పూర్వికులు ఏ విధముగా ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన ఎరువులను , వాటి పంటలను పండించి ఆరోగ్యంగా ఉన్నారో, అలానే మళ్లీ పంటలు పండించే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శాసనసభ్యులు సూచించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


