ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
MLA Songa Roshan Distribution

MLA Songa Roshan : త్రినేత్రం న్యూస్ : జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా: జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరంలోని అంగన్వాడీ కేంద్రాలకు చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఇండక్షన్ స్టవ్స్‌ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఇప్పటికే అనేక కేంద్రాల్లో మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యాల కల్పనకు చర్యలు చేపట్టామని, మిగిలిన సమస్యలను కూడా త్వరలో పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు.

చింతలపూడి నియోజకవర్గంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్స్‌తో పాటు అవసరమైన వంట సామాగ్రిని కూడా అందజేసినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. ఈ సౌకర్యాలతో చిన్నారులకు నాణ్యమైన పోషకాహారం తయారీలో మరింత మెరుగైన వాతావరణం ఏర్పడుతుందని పేర్కొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల అభివృద్ధికి సహకరిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. వారి నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా ముందుకు సాగుతోందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page