
తేదీ : 15/04/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుడివాడ నియోజకవర్గం పరిధిలోని యువత నిరుద్యోగులు మహిళలకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే వెని గండ్ల రాము కృషి చేయడం జరుగుతుంది. అని పట్టణ టిడిపి అధ్యక్షులు డి. రాంబాబు అన్నారు. గుడివాడ పట్టణ కైకాల కళామందిర్ ప్రాంగణంలో తన్వి ఫుడ్స్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో మహిళలకు జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉద్యోగ అవకాశాల కల్పన కార్యక్రమంలో 36 వార్డుల పరిధిలోని మహిళలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మేనేజర్ గంగా చారి మాట్లాడుతూ ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు వందమంది కి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో జాబ్ మేళా నిర్వహించినట్లు చెప్పారు. టిడిపి అధ్యక్షులు మాట్లాడుతూ మహిళలకు ఉపాధి కల్పించాలనే మంచి ఉద్దేశంతో జాబ్ మేళా నిర్వహించిన సంస్థ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా వందలాది మంది యువత ఉద్యోగ అవకాశాలు పొందినట్లు ఆయన తెలిపారు.
ఒకవైపు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూనే, మరోవైపు ప్రజల శ్రేయస్ కోసం ఎమ్మెల్యే కృషి మరువలేము అని రాంబాబు తెలిపారు. వ్యక్తిగత ధ్రువీకరణ పత్రాలు పరిశీలించిన అనంతరం పలువురు మహిళలకు తన్వి సంస్థలు ఉద్యోగాలు ఇస్తున్నట్లు ప్రతినిధులు ప్రకటించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తన్వి ఫుడ్స్ లిమిటెడ్ ప్రొడక్షన్ అధికారి యం. బాలాజీ , ఫెసిలిటీస్ మేనేజర్ దుర్గా. ప్రసాద్ గుడివాడ టిడిపి నాయకులు చేకూరు. జగన్ మోహన్ రావు, వి. సాంబశివరావు, సయ్యద్. జబీన్, విశ్వనాథ్, కోడూరి. ప్రభు, దేవాది. నాగేశ్వరరావు, బురాడ. మధు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
