MLA Makkonsingh Raj Thakur has paid off the debt without winning Vamsi as MP
ఘనంగా కాక జయంతి వేడుకలు
ఎంపిగా వంశీని గెలిపించి కాక రుణం తీర్చుకున్నాం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
స్వర్గీయ కేంద్ర మాజీ మంత్రివర్యులు జి. వెంకటస్వామి 95 వ జయంతి వేడుకలు నగర, పట్టణ అధ్యక్షులు బొంతల రాజేష్, తిప్పారపు శ్రీనివాస్ గార్ల ఆధ్వర్యంలో శనివారం స్థానిక జిమ్ ఆఫీస్ మూలమలుపు వద్ద గల కాక విగ్రహం వద్ద వేడుకలు ఘనంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై కాక విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలకు ఎనలేని కృషిచేసి కేంద్ర కార్మిక మరియు జౌళి శాఖ మంత్రిగా జి వెంకటస్వామి గారు మన ప్రాంతానికి మరియు పార్టీకి చేసిన విశేష కృషికి గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు నేతృత్వంలో కాకా మనవడు గడ్డం వంశీకృష్ణ పెద్దపెల్లి పార్లమెంటు సభ్యుడిగా గెలిపించుకొని ఆయన రుణం తీర్చుకున్నామని, తొలి మలిదశ తెలంగాణ ఉద్యమాన్ని కాక ప్రత్యక్షంగా ఎన్నో పోరాటాలకు సారథ్యం వహించడమే కాక ఒక దళిత కార్యకర్త నుండి కేంద్ర మంత్రిగా ఎదిగిన గొప్ప మహానేత వెంకటస్వామి వారి సేవలకు గుర్తుగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి జయంతి మరియు వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం చాలా హర్షణీయమని అదేవిధంగా కాక కుటుంబంతో సన్నిహిత సంబంధాలు నాకు కలిగి ఉన్నాయని వారి కుటుంబంలో సభ్యుడిగా ఉన్నానన్నారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వారికి భారతరత్న ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం చే సిఫార్సు చేస్తామని అన్నారు అలంకరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పి. మల్లికార్జున్ ఆధ్వర్యంలో స్థానిక ప్రధాన చౌరస్తాలో అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు యొక్క కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే రాష్ట్ర హాజరై స్వయంగా వడ్డించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో నగర మేయర్ అనిల్ కుమార్, గుమ్మడి కుమారస్వామి, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, పెద్దెల్లి ప్రకాష్, ముస్తఫా, గట్ల రమేష్, పాతిపల్లి ఎల్లయ్య, శంకర్ నాయక్, దొంత శీను, కలవల సంజవ్, బొమ్మక రాజేష్, చుక్కల శ్రీనివాస్,కొప్పుల శంకర్, పాత పెళ్లి రవి, నాయిని ఓదెలు, బాలరాజు, సింహాచలం, దూళికట్ట సతీష్,దాసరి విజయ్, నజీమ్, బాబు మియా, వరలక్ష్మి, శాంతి, అల్లి శంకర్, విజయ్, దుబాషి మల్లేష్, అను మాస శ్రీనివాస్ , మల్లేష్ యాదవ్, తిప్పారపు మధు, తో పాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App