MLA Jare : అశ్వారావుపేట మండల కేంద్రంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే జారే

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ అశ్వారావుపేట మండలం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట శాసనసభ్యులు జారే ఆదినారాయణ. ఆదివారం మండల కేంద్రంలో విస్తృత పర్యటన నిర్వహించారు. ప్రభుత్వ అనుమతులు పొందిన, ఎకోపార్క్ నిర్మాణానికి మండల నాయకులతో కలసి స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. వర్షాకాలం నేపథ్యంలో చోటుచేసుకునే సీజనల్ వ్యాధులకు సంబంధించి కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో అందిస్తున్న వైద్య సేవలను పరిశీలించారు.

అక్కడి వైద్యులచే అందిస్తున్న చికిత్సల గురించి వివరాలు తెలుసుకుని పలు సూచనలు చేశారు. తర్వాత కెమిలాయిడ్స్ గెస్ట్‌హౌస్‌ లో లయన్స్ క్లబ్ 40వ వార్షికోత్సవ వేడుకలు మరియు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా, క్లబ్ సభ్యులకు అభినందనలు తెలుపుతూ సమాజంలో సేవా కార్యక్రమాలకు. ప్రజాప్రతినిధుల సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తుమ్మ రాంబాబు. జూపల్లి ప్రమోద్. సూరపనేని పణి. మిండా హరిబాబు. అల్లాడి రామారావు. నార్లపాటి రాములు. తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

MLA Jare toured Aswaraopet

You cannot copy content of this page

Scroll to Top