
త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం. ములకలపల్లి మండలం సీతాయిగూడెం పంచాయతీ సూరంపాలెం గ్రామంలో శ్రీ హనుమాన్ సీతా లక్ష్మణ సపరివార దేవతా సహిత శ్రీ కోదండ సీతారామ స్వామి వారి యంత్రం విగ్రహ ద్వజ శిఖర ప్రతిష్టా మహోత్సవానికి ముఖ్య అతిధిగా హాజరైన అశ్వారావుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ దంపతులకు ఆలయ మర్యాదలతో అర్చకులు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజా కార్యక్రమం అనంతరం మహా అన్నదాన కార్యక్రమం ఎమ్మెల్యే దంపతుల చేతుల మీదుగా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాండ్ర ప్రభాకర్ మరియు మాజీ జడ్పిటిసి బత్తుల అంజి, మాజీ సర్పంచ్ కారం సుధీర్ కుమార్, ములకలపల్లి మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోడిమే వంశీ మరియు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
