దేవరకొండ సెప్టెంబర్ 18 త్రినేత్రం న్యూస్. దేవరకొండ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో 69వ (ఎస్ జి ఎఫ్)స్కూల్ గేమ్ ఫెడరేషన్ దేవరకొండ నియోజక వర్గ స్థాయి అండర్ 14&17 బాల, బాలికల క్రీడల పోటీలను అధికారులు, ప్రజా ప్రతినిధులతో కలిసి ఎం ఎల్ ఏ నేనావత్ బాలు నాయక్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ:- విద్యార్థులు చదువుతో పాటు క్రీడలను అలవాటు చేసుకోవాలని సూచించారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని సానుకూల దృక్పథంతో స్వీకరించాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులు రాష్ట్రంలో నిర్వహించే పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. దేవరకొండ క్రీడల అభివృద్ధి కోసం చర్యలు చేపడతామని వెల్లడించారు.
నియోజక వర్గంలో ప్రతి మండలాల్లో ఒక్క మినీ స్టేడియాల నిర్మాణంపై యోచిస్తున్నట్లు తెలిపారు. దేవరకొండ పట్టణంలోని జూనియర్ కళాశాలలో మినీ స్టేడియం నిర్మాణం కొరకు 2కోట్ల రూపాయలు మంజూరు అయింది , త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


