సెప్టెంబర్ 10, 2026
TRINETHRAM NEWS
Deputy CM reviews

Deputy CM Reviews : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 10 ; ప్రత్తిపాడు మండలం , ధారపల్లి సమీపంలో రిజర్వ్ అటవీ ప్రాంతంలో పులి సంచారం పై రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. దాని కదలికలు, ప్రస్తుత పరిస్థితి, అటవీ శాఖ చేపడుతున్న చర్యలు , సరిహద్దు అదేవిధంగా గ్రామాల గ్రామాల భద్రతపై ఆయన ఆరా తీశారు.

ఆ పులి జనంలోకి ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని , ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూనే, దానికి హాని కలపకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే స్పందించేలా రాపిడ్ రెస్పాన్స్ బృందాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page