ఆగస్ట్ 14, 2026
TRINETHRAM NEWS
MLA Balu Naik

MLA Balu Naik : దేవరకొండ డివిజన్ ఆగష్టు 14, త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ హాజరై పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులపై అధికారులు, మున్సిపల్ సభ్యులతో సమీక్షించారు.

సమావేశంలో ప్రధానంగా సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, విద్యుత్‌ లైన్లు, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్‌ యార్డు, ఎస్‌టీపీ (STP), వెట్‌వెల్స్, మున్సిపల్‌ పార్కుల అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో అవసరమైన రోడ్ల నిర్మాణం, మరమ్మతులు చేపట్టడంతో పాటు డ్రైనేజీ సమస్యలను పరిష్కరించాలని సమావేశంలో చర్చించారు. తాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రజలకు నిరంతర విద్యుత్‌, వీధి దీపాల సౌకర్యం కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సర్వసభ్య సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్, అధికారులు, ఛైర్పర్సన్ పున్న శైలజ-వెంకటేశ్వర్లు, మహ్మద్ జూవేరియా జువేరియా తబస్సుం-సమీర్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పాల్గొని పట్టణ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page