Trinethram News : హైదరాబాద్: మేడిగడ్డ బ్యారెజ్ సందర్శనకు ఏర్పాట్లు చేయాలని నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు. మేడిగడ్డలో పిల్లర్ కుంగడం చాల తీవ్రమైన అంశమన్నారు. నీటి పారుదల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి జలసౌధలో ఆ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ కుంగడంపై మంత్రికి అధికారులు వివరణ ఇచ్చారు. “ ఒక పిల్లర్ 1.2 మీటర్లు కుంగడంతో.. మరో మూడు పిల్లర్లపై ఆ ప్రభావం పడింది. ముందురోజు సాయంత్రం పిల్లర్ కుంగిన వెంటనే ప్రాజెక్టులో నీటిని తోడేశాం. ఆ తర్వాత కుంగడం తగ్గింది” అని చెప్పారు.
నీటి పారుదల శాఖ అధికారులను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశించారు
Related Posts
రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు
TRINETHRAM NEWS రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్…
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…