సెప్టెంబర్ 27, 2026
TRINETHRAM NEWS
Minister Narayana

Minister Narayana : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27; నెల్లూరు నగరాన్ని 2028 జూన్ 12 నాటికి గ్రీన్ సిటీగా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ, వచ్చే ఏడాది జూన్ 12 లోపు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, త్రాగునీరు పనులను పూర్తి చేస్తామని చెప్పారు. గత వైసిపి ప్రభుత్వం హాయంలో చివరి దశలో 10% పనులు పూర్తి కాక నిధులు వెనక్కి వెళ్ళాయని వెల్లడించారు.

అయితే ప్రస్తుతం మళ్లీ నిధులు సమీకరించి పనులు చేపడతామని స్పష్టం చేశారు. నెల్లూరు ను దోమలు లేని నగరంగా మార్చడమే లక్ష్యమని సూచించారు. నవాబుపేటలో 21.3 ఎకరాల్లో రూపాయలు 60 కోట్లతో సంబంధిత విధానంలో కమర్షియల్ ప్రాజెక్టును అభివృద్ధి చేస్తామని అన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page