మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు కరువు…
ఉపాధి హామీ పథకం కూలీలతో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు ఎలిమినేటి హుస్సేన్,మొగిల్ల వెంగలయ్య
డిండి (గుండ్ల పల్లి) మే 10 త్రినేత్రం న్యూస్ : డిండి మండలం సింగరాజుపల్లి గ్రామంలో ఉపాధి పనులు చేస్తున్న కూలీలను వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు శనివారం కలిశారు.ఈ సందర్బంగా వ్యవసాయ కార్మిక సంఘం దేవరకొండ నియోజకవర్గంl అధ్యక్ష,కార్యదర్శులు ఎలిమినేటి హుస్సేన్,మొగిల్ల వెంగలయ్య మాట్లాడుతూ…
మూడు నెలల నుండి కూలీలకు వేతనాలు రావడం లేదని,పని ప్రదేశాలలో కనీస సౌకర్యాలు లేక ఉపాధి హామీ కూలీలు నానా అవస్థలు పడుతున్నారనీ అన్నారు.పని ప్రదేశాలలో మంచినీరు టెంట్ సౌకర్యం ఓఆర్ఎస్ ప్యాకెట్లు మెడికల్ కిట్టు తదితర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు.ఉపాధి హామీ కూలీలకు పారా, గడ్డపార,తట్ట పనిముట్లు ఇవ్వాలని,పని దినాలు 200 రోజులు కల్పించి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజువారి వేతనము 700 రూపాయలు ఇవ్వాలనీ వారు డిమాండ్ చేశారు. పని ప్రదేశాలలో ఫొటోస్ స్కానింగ్ విధానాన్ని ఎత్తివేయాలని, ఉపాధి కూలీలకు పెండింగ్ కూలిని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ గిరిజన సమాఖ్య నాయకులు రామావత్ దేవిలాల్, ఉపాధి హామీ కూలీలు కడారి వెంకటయ్య,జంతుక బాలయ్య,శ్రీపతి నిరంజన్, ఎలిమినేటి వెంకులు,బాల రాములమ్మ, సోమిడి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


