సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS

గ్రీన్‌ టాక్స్‌ తగ్గించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు

అన్ని వేళలా సహకారం అందిస్తామని ఎమ్మెల్యే వాసు హామీ

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజమహేంద్రవరం : ది రాజమండ్రి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు)ను తిలక్‌ రోడ్డులోని తన కార్యాలయంలో ఆదివారం కలుసుకున్నారు. రవాణా వాహనాల (లోడిరగ్‌ వాహనాలు) కు రవాణా శాఖ విధించే గ్రీన్‌ టాక్స్‌ను తగ్గించేలా కృషి చేసి తమకు ఊరట కలిగించినందుకు గాను ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును కలుసుకుని రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. గతంలో నిర్వహించిన ఒక సమావేశంలో లోడిరగ్‌ వాహనాలకు గ్రీన్‌ టాక్స్‌ జగన్‌ ప్రభుత్వం రాకముందు రూ. 200 మాత్రమే ఉండేదని, జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మొత్తాన్ని రూ. 17,000 లకు పెంచడం వల్ల తమపై అధిక భారం పడిరదన్న విషయాన్ని లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు దృష్టికి తీసుకువచ్చి గ్రీన్‌ టాక్స్‌ తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తమకు ఊరట కలిగించాలని విన్నవించారు.

వారి విన్నపం పట్ల సానుకూలంగా స్పంధించిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ఆ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్యకు పరిష్కారం చూపించాలని కోరారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ విధిస్తున్న గ్రీన్‌ టాక్స్‌ను రూ. 17,000ల నుంచి రూ. 3000లకు తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపధ్యంలో ది రాజమండ్రి లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ సభ్యులు వారికి భారీ ఊరట కలగడంతో ఈ రోజు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకుని ధన్యవాదాలు తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌, మంత్రి నారా లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా వెహికల్స్‌ ఫిట్‌నెస్‌ విషయంలో పలు సంస్థలకు ఇచ్చి మెషిన్‌ స్కానింగ్‌ విధానం ద్వారా ఇస్తున్న ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని,

ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసును కోరారు. దీనిపై ఆయన సానుకూలంగా స్పంధించి ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్‌ అధ్యక్షులు విక్రం దుర్గా శ్రీనివాసరావు, కార్యదర్శి మొల్లి వెంకట రమణ, కోశాధికారి వంకా నాగ చిరంజీవి, ఉపాధ్యక్షులు దొంతంశెట్టి వెంకటేశ్వరరావు, జాయింట్‌ సెక్రటరీ రెడ్డి నాగరాజు, మాజీ అధ్యక్షులు బోడసింగు శ్రీనివాసరావు, కమిటీ సభ్యులు ఎన్‌ఎస్‌ నారాయణమూర్తి, టి సుధాకర్‌, ఎంసీహెచ్‌ అప్పలనాయుడు, ఎం సాయిభాను, ఈ బాలరాజు, డి రాంబాబు, ఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Members of the Lorry

You cannot copy content of this page