TRINETHRAM NEWS

విశాఖపట్నం స్టీల్ ప్లాంటు ప్రైవేటుకరణ పెట్టుబడుల ఉపసంహరణ
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ పట్టణం
భారత ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖ కేంద్రమంత్రి వర్యులు.(గౌరవ పెద్దలు)
– హెచ్ డి కుమారస్వామి జీ..ని మర్యాదపూర్వకంగా కలిసి వినతి పత్రాన్ని సమర్పించిన వైసిపి పార్టీ పార్లమెంట్ సభ్యులు.

హాజరైన అరుకు పార్లమెంట్ సభ్యురాలు (ఎంపీ)
డా||గుమ్మ తనూజరాణి .

తేది: 02.12.2024, భారత రాజధాని న్యూఢిల్లీ.
ఉద్యోగ్ భవన్ మౌలానా ఆజాద్ రోడ్డు:
ఢిల్లీలో కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల శాఖమంత్రి హెచ్‌.డి.కుమారస్వామిని కలిసి విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ, పెట్టుబడుల ఉపసంహరణను పునఃపరిశీలించాలని వినతిపత్రం అందజేసిన వైయస్ఆర్ సీపీ ఎంపీల బృందం.

– హెచ్ డి కుమారస్వామి ని. కలిసిన వైయస్ఆర్ సీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వైవీ సుబ్బారెడ్డి, రాజ్యసభ ఫ్లోర్‌ లీడర్‌ వి.విజయసాయిరెడ్డి, లోక్‌సభ ఫ్లోర్‌ లీడర్‌ పి.వి.మిథున్ రెడ్డి, ఎంపీలు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, గొల్ల బాబూరావు, ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, మద్దిల గురుమూర్తి, మేడా రఘునాధ్‌ రెడ్డి, గుమ్మ తనూజా రాణి .

విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా భావించే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించి క్యాప్టివ్‌ మైనింగ్‌ లేకపోవడం ప్రధాన అడ్డంకిగా మారింది, తద్వారా లాభదాయకతను ప్రభావితం చేస్తుందని కేంద్రమంత్రికి తెలిపిన వైయస్ఆర్ సీపీ ఎంపీలు.

విశాఖ ఉక్కు టర్న్‌ అరౌండ్‌ సాధించడానికి అవసరమైన చేయూత కేంద్రం అందించాలని వినతిపత్రంలో కోరిన ఎంపీలు, మరో రెండేళ్ళపాటు కేంద్రం నుంచి చేయూత అందితే ఆర్థిక పరిస్ధితి మెరుగువుతుందన్న ఎంపీలు.

ఇన్‌పుట్‌ ఖర్చులను తగ్గించడానికి వీలుగా ఆర్‌ఐఎన్‌ఎల్ కు క్యాప్టివ్‌ మైన్‌లను కేటాయించడం ద్వారా వ్యయప్రతికూలతలను అధిగమించేందుకు సహాయపడుతుందని, కేంద్రం సహకారం అందిస్తే ప్లాంట్‌ మళ్ళీ లాభదాయకమైన వెంచర్‌గా మారుతుందని కేంద్ర మంత్రికి తెలిపిన ఎంపీలు.

ఆర్థిక పునర్నిర్మాణానికి కేంద్రం సాయపడాలని విజ్ఞప్తి, తమ విజ్ఞప్తిపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారన్న వైయస్ఆర్ సీపీ ఎంపీల బృందం, వచ్చే కేబినెట్ లో ఈ ప్రతిపాదనలు పెడతానని హామీ ఇచ్చారన్న ఎంపీలు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App